తెలంగాణ వెబ్ న్యూస్;ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని...ఎమ్మెల్సీగా పోటీ చేయనని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు.తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఏపీ సీెం చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా మిత్రులతో తలసాని శ్రీనివాసయాదవ్ చిట్ చాట్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కదా...ప్రస్తుతం ఎమ్మల్సీ ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్సీ పదవి చేపడతారా అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు తలసాని శ్రీనివాస యాదవ్ పై విధంగా స్పందించారు.
No comments:
Post a Comment