తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ ఉభయ సభల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు.శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...అధికారపక్షం తీరును తూర్పారబట్టారు.బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజల సమస్య ల పరిష్కారం ఎలాంటి ఆలోచన చేయడం లేదని విమర్శించారు.అదరీని చెప్పుచేతల్లో ఉంచుకోవాలని బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. సభలో జరిగిన విషయాలను బయటకు చెప్పకుండా,తమకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే విడుదల చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు.సభలో జరిగిన విషయాలకు సంబంధించిన దృశ్యాలనుబయటకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అధికార మదంతో టీఆర్ఎస్ నాయకులు విపక్ష నాయకులను అణగతొక్కాలని చూస్తున్నారని విమర్శించారు.ప్రతిపక్షాల గొంతునొక్కిన తీరు ఇకముందు సాగబోదన్నారు.
No comments:
Post a Comment