తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజధాని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.రైతుల కన్నీళ్లతో కాదని,రైతులకు మేలు జరిగే విధంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.రాజధాని నిర్మాణం జరిగితే రైతుల భూములకు ధరలు వస్తాయని,వారు కూడా అభివృద్ధి చెందుతారని స్పష్టం చేశారు.రాజధాని భూములపై జనసేన అధినేత,సినీహీరో పవన్ కల్యాణ్ ఏ సందర్భంలో ఏమిమాట్లాడారో తెలియదని,కానీ భూములు సమీకరణలో ఎవరినీ బలవంతం,మోసం చేయలేదన్నారు.రాజధాని నిర్మాణం,అభివృద్ధి,పెట్టుబడులతో యువతకు ఉపాధి,ఉద్యోగాలలు లభిస్తాయని తెలిపారు.గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.ఆయన మాటల్లోనే..రైతుల అంగీకారంతో,ఎలాంటి ఆందోళనలు లేకుండా స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలను భూ సమీకరణ కింద తీసుకున్నాం.ఎవరినీ మోసం చేసి తీసుకోలేదు,నాపై నమ్మకంతో రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.మోసం చేసినట్లయితే ప్రతిపక్షాలు ఆధారాలు చూపించాలి.
No comments:
Post a Comment