తెలంగాణ వెబ్ న్యూస్;ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఏరు దాటక ముందు ఏటి మల్లన్న.....ఏరుదాటాక ఓటి మల్లన్న అన్నట్లు ఎన్నికల ముగిసిన తర్వాత డ్వాక్రా మహిళలను చంద్రబాబు రోడ్డున పడేశారని ఆమె అన్నారు.డ్వాక్రా మహిళలను డబ్బులిచ్చి మరీ పమావేశాలకు తీసుకు వచ్చే చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా వారిని విస్మరించారన్నారు.అసెంబ్లీ నుంచి వాకౌట్ అనంతరం రోజా మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ రైతు రుణాలలు,డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించడానికి టీడీపీకి దమ్ము,ధైర్యం లేదని అన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ అంశాన్ని చర్చించాలని తాము డిమాండ్ చేస్తే....ఇప్పుడు ఆ అంశం అంత ముఖ్యమా అని అసమానం వ్యక్తం చేస్తుంటే...ఆడపడుచులంటే వీరికి అంత చులకనా అనే భావం కలుగుతుందన్నారు.
No comments:
Post a Comment