All meadia

 

Friday, 6 March 2015

కేసీఆర్ ఓ జలగ ;రేవంత్

తెలంగాణ వెబ్ న్యూస్;ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తంపీలుస్తున్న జలగఅని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.చినజీయర్ స్వామి  దృష్టిలో కేసీఆర్ జాతిపిత  అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ, శ్రీకాంతాచారి ఏం కావాలని ప్రశ్నించారు.కేసీఆర్ జాతిపిత కాదని,ఆయనో పెద్ద జలగ అని అన్నారు. సీఎంకు చినజీయర్ స్వామిఇచ్చిన బిరుదును వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పదవులు పంచుకోవడానికి,ప్రజలపై పన్నులు వేయడానికే నిన్నటి టి.కేబినెట్ సమావేవం జరిగిందని ఆరోపించారు.వస్త్రవ్యాపారులు పోరాడి సాధించుకున్న హక్కును నిన్నటి కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ రద్దు  చేశారన్నారు. వస్త్రాలపై పన్ను వేయడం దుర్మార్గమని రోవంత్ అన్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు ప్రశ్నించారని,కానీ కూతురు పదవి కోసం తెలంగాణకుఅన్యాయం జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శించారు.ఏపీ బ్రాహ్మణులు ఆడంబరులు అన్న కేసీఆర్..తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన చినజీయర్ స్వామిని తెలంగాణపై ఎందకు రుద్దుతున్నారని ప్రశ్నించారు.ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ చెప్పడంలో తప్పులేదన్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని పేర్కొన్నారు.

No comments:

Post a Comment