All meadia

 

Sunday, 8 March 2015

అలాగైతే కేసీఆర్ ను పరిగణిస్తాం;సురవరం

తెలంగాణ వెబ్ న్యూస్;ముఖ్యమంత్రి కేసీఆర్  ను కమ్మూనిస్టులు ఇంకా తమ ప్రదాన శత్రువుగా భావించడం లేదని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.అయితే విధానాలను పక్కన పెట్టి బీజేపీతో జతకడితే మాత్రం కేసీఆర్ ను తాము ప్రధాన శత్రువుగానే పరిగణిస్తామన్నారు.పట్టణంలో నిర్వహించిన సీపీఐ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ...ఒక్క మంత్రి పదవి కోసం కేసీఆర్ కేంద్రంలో బీజేపీతో జతకట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధాలనాలపై కమ్యూనిస్టులంతా ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించక తప్పదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంనుపొగుడుతూ తెలంగాణ ఉద్యమకారులు,సాయుధ పోరాట యోధులను అవమానిస్తున్నారన్నానరు. ప్రతిపక్షాలు,పత్రికలు,చానెళ్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.ఇది దుర్మార్గపు చర్యఅనిదీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సురవరం పేర్కొన్నారు.

No comments:

Post a Comment