తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ ను కేంద్రమే ఆదుకోవాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ విజప్తి చేవారు.రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. కొద్ది పాటి వనరులతో,ఆదాయానికి మించిన వ్యయంతో ఏర్పడ్డ రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహాకారాలు అవసరమని గవర్నర్ పేర్కొన్నారు.రెవెన్యూ లోటు భర్తీ,పారిశ్రామిక ప్రోత్సాహకాలు,వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ,రాజధాని అభివృద్ధికి సాయం,రైల్వే జోన్,ప్రత్యేక హోదా వంటి వాటితోపాటు అనేక అంశాల్లో రాష్ట్రానికి ప్రసంగించారని గుర్తు చేశారు.2014 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యస్థీకరణ చట్టంలోనూ రాష్ట్రానికి కేంద్రం వివిధ హామీలను ఇచ్చిందని తెలిపారు.
No comments:
Post a Comment