All meadia

 

Tuesday, 3 March 2015

భూములు లాక్కుని రౌడీల్లా వ్యవహరిస్తున్నారు

తెలంగాణ వెబ్ న్యూస్;రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని వైసీపీ అధినేత ,ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు.మంగళవారం ఏపీ రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో పర్యటించిన ఆయన అక్కడి రైతులతో మాట్లాడారు.వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులకు అండగా వైసీపీ పోరాటం సాగిస్తుందన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం భూములు తిరిగిచ్చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వంతో  పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రజలను నిరాశపర్చేలా వ్యవహరిస్తోందని జగన్ దుయ్యబట్టారు.

No comments:

Post a Comment