తెలంగాణ వెబ్ న్యూస్;ఏప్రిల్ 12 నుంచే ఇచ్చే యోచన జూన్ 1నే పాఠశాలల ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవుల్ని ముందే ప్రకటిస్తే ఎలాఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది.ఏటా ఇచ్చినట్లుగా ఏప్రిల్ 24 నుంచి కిాకుండా ఈసారి ఏప్రిల్ 12 నుంచే సెలవులివ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఆమేరకు పునఐప్రారంబ తేదీని జూన్12కు బదులు జూన్1కు మార్చాలని యోచిస్తున్నట్లు తెలిసింది.జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలనీ,పాఠశాలలు కూడా వీటిలో పాల్గొనాలనే
ఉద్దేశంతో ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది.అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.ముఖ్యమంతరి కేసీఆర్ అనుమతిస్తే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఏప్రిల్ 24 నుంచి సెలవులుంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.అయితే ఈ ప్రతిపాదనలపై విద్యాశాఖకు ఎలాంటి సమాచారం లేకపోవటం గమనార్హం.అయితే వేసవి సెలవుల్ని ముందుకు జరిపితే వచ్చే ఇబ్బందులపై విద్యాశాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.ఏటా ఏప్రిల్ 12 తర్వాతే ఒకటి నుంచి 9 వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మార్చి 25 నుంచి ఏప్రిల్11 వరకు పదో తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. 12 వతేదీ నుంచి బడులకు సెలవులివ్వాలంటే 1 నుంచి 9 వ తరగతి పరీక్షల్ని కూడా ఏప్రిల్ ఒకటి నుంచే నిర్వహించాలి. ఉదయం పదోతరగతి పరీక్షలైతే మధ్యాహ్నం మిగిలిన తరగతుల పరీక్షలు పెట్టి,11 వ తేదీకల్లా ఫలితాలు కూడా విడుదలచేయాల్సిఉంటుంది.ఉపాధ్యాయుల్లేరు..సన్నాహాలెలా?మరోవైపు మార్చి తొలివారం నుంచే పాఠశాల్లో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవటం పై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
No comments:
Post a Comment