తెలంగాణ వెబ్ న్యూస్;నిలోఫర్ ఆస్పత్రిలో నర్సులనిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది.ఒకే సిరంజితోమోత్తం చిన్నారులకు ఇంజక్షన్ చేయడంతో అది కాస్తా వికటించింది.ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.నిలోఫర్ లోని ఎమర్జెన్సీ విభాగం మూడో అంతస్తులో ఐదేళ్లలోపున్న 30 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వైద్యులు రాసిచ్చినదాని ప్రకార్ం వారికి రె్యులర్ గా ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంది.ఇందుకు ఒక్కో రోగికి ఒక్కో సిరంజిని ఉపయోగించాలి.కానీ ఆదివారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నర్సులు ఒకే సిరంజితో మొత్తం 30 మంది చిన్నారులకూ ఇంజక్షన్లు చేసేశారు.దీంతో,కొందరికి చేతులు వాచిపోయాయి.మరికొందరికి రక్తం గడ్డ కటింది నొప్పిని భరించలేక చిన్నారుల ఏడుపులు తీవ్రమయ్యాయి.ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వారి చేతులను చూసిన తర్వాత అసలు విషయం అర్థమైంది.దీనిపై నర్సులను నిలదీయగా,ఇప్పుడు తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. తల్లిదండ్రులు ఆంధోళనకు దిగడంతో ఉద్రికత పరిస్థతులు ఏర్పడ్డాయి.ఆదివారం కావడంతో వైద్యులు అందుబాటులో లేరు. పోలీసులు తల్లిదండ్రలను అదుపు చేసి సోమవారం అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
No comments:
Post a Comment