All meadia

 

Friday, 13 March 2015

తేది-13-03-2015 ప్ర‌తికా ప్ర‌క‌ట‌న‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గౌరవంగా తమ విధులను నిర్వర్తించేందు కోసమే వారికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ… వారి గౌరవ వేతనాలను పెంచామ‌ని, ఈనిర్ణ‌యం గ్రామాల సమగ్రాభివృద్ధి సాధనలో ఇది తొలి అడుగని ముఖ్యమంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు గారు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో… స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్ర గణనీయంగా ఉందన్నారు. త్వరలోనే సర్పంచులతో సమావేశం నిర్వహించి… గ్రామాల అభివృద్ధిపై విస్తృతమైన చర్చను చేపడతామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసి చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు గౌరవం ఉండాలని… గౌరవ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. ఒకవైపు ప్రభుత్వం పెన్షన్లు, చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌, వాట‌ర్ గ్రిడ్‌ వంటి సంక్షేమ పథకాలతో.. ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నదని.. మరోవైపు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న అనేక వ‌ర్గాల డిమాండ్‌ల‌ను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామన్నారు. స్ధానిక సంస్ధ‌ల ప్ర‌తినిధుల వేతనాల పెంప

.

No comments:

Post a Comment