తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని,దొరస్వామ్యమే నడుస్తోందనిటీటీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యుడు మొత్కుపల్లినర్సింహులు ధ్వజమెత్తారు.దేశంలో మహిళలు,దళితులకు ప్రాతినిధ్యంలేని ఏకైక మంత్రివర్గం కేసీఆర్ దేనని విమర్శించారు.
దళితులు,మహిళలకు రాజ్యాగం హక్కులు కల్పించినప్పటీకీ వారిని గౌరవించడానికి నిరాకరిస్తున్న కేసీఆర్ పై తాము యుద్దం ప్రకటిస్తున్నామని ఆయన హెచ్చరించారు. ఇది మాదిగలు చేసే తెలంగాణ ఆత్మగౌర యుద్దమని ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఈనెల 9న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్దమాల,మాదిగల ధూం ధాం నిర్వహించనున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా ధూంధాం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
No comments:
Post a Comment