All meadia

 

Thursday, 12 March 2015

ఆయన్ని ఎందుకు చేర్చుకున్నారు.

తెలంగాణ వెబ్ న్యూస్;శిల్పామోహన్ రెడ్డిని మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని టీడీపీ నాయకులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.వైెస్ఆర్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం పథకంలో అక్రమాలు జరిగాయాని టీడీపీ చేసిన ఆరోపణలను అసెంబ్లీలో జగన్ తిప్పికొట్టారు.అక్రమాలు జరిగాయాని ఆరోపిస్తున్న టీడీపీ...అప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన శిల్పామోహన్ రెడ్డిని ఎందుకు పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిందని జగన్ ప్రశ్నించారు.తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తల్లికాంగ్రెస్,పిల్లకాంగ్రెస్ అంటూ ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు.తాము వైఎస్ఆర్ వారసులమని జగన్ స్పష్టం చేశారు.మనిషి ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి జగన్ అన్నారు.

No comments:

Post a Comment