తెలంగాణ వెబ్,న్యూస్;హైదరాబాద్ మహానగరం ఇలా ఉంటుందా అని అబ్బురపడేలా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.తక్కువ వ్యవధిలోనే అత్యద్భుత వసతులతో...పరాపూర్ణ విశ్వనగరంగా జంట నగరాలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో జీహెచ్ఎంపీ ఆధ్వర్యంలో డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద 303 కార్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గత పాలకులు నగరాన్ని నాశనం చేశారని విమర్శించారు.
No comments:
Post a Comment