ఉచిత వైద్య క్యాంపును ప్రారంభిస్తున్న గైనకాలజి అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షురాలు అరుణా రేచర్ తదితరులు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని గైనకాలజి అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షురాలు అరుణా రేచర్ అన్నారు. రోటరీ క్లబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య క్యాంపును ఆదివారం సికింద్రబాద్ లోని వెస్ట్ మారెడ్ పల్లిలో ఉచితంగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ కు ఈ విధమైన వైద్య చికిత్సలు చేసుకోవాలని అనే అంశంపై చర్చించారు. దానిని అధిగమించడానికి కావల్సిన సూచనలు ఆమె వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు వైద్య పరీక్షలు చేసుకొని వాటిని నియంత్రించడానికి తోడ్పాటును అందించాలన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ గర్భినీ స్త్రీలకు వ్యాధి నిరోధక టికాలు ఇస్తున్నామని తెలిపారు. సీత మాట్లాడుతూ ఈ సమావేశాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, చంద్రకళ గోయల్ హెల్త్ కేర్ ట్రస్టు, ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్, సిడిటిపి గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇఎల్ బిఐ మెడికల్ డయగ్నస్టిక్స్ సహాకారంతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ద కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు జెఎం రెడ్డి, సుధీర్, సుబ్బరాజ్, హైమా, సీతా, రాజ్, రామ్ గోపాల్, నర్సింహా, మోహన్, జయశ్రీ, సీతారామ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫోటోలు...
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment