ఒక పాము పడగ మీద ఒక కందిరీగ చక్కగా కూర్చుంది.చాలా సార్లు దాన్ని కుట్టడమే కాకుండా గట్టిగా పట్టి వదలడం లేదు.
ఈ బాధని పాము భరించలేకపోయింది. ఎలాగైనా కందిరీగని వదుల్చుకోవాలని చూసింది.చెట్టుకీ పుట్టకీ పడగ రాసిరాసి చూసింది.కాని ఫలితం దక్కలేదు. ఇక ఏం చేయాలో తెలియక -దానికి పిచ్చిగా కోపం వస్తోంది. బుసలు కొట్టినా కందిరీగ పట్టించుకోలేదు ''నిన్ను చంపి తీరతాను. ఆచంపే ప్రయత్నంలో నేను చచ్చినా బాధపడను '' అని పాము శపథం చేసింది. అంతేకాదు.రహదారిపై దారికాచి భారంగా కిర్రుకిర్రుమంటూ వస్తూన్న సరుకుల బండి చక్రం కింద తన తలపెట్టింది.పాముతో పాటు కందిరీగ కూడా చచ్చింది.
నిజమే కదా, నిస్సహాయమైన స్థితిలో ఏం చేయాలో తోచనప్పుడు ఇలా ప్రాణం తీసుకునేందుకైనా వునుకాడరు బలవంతులైనా -బలహీనులైనా......కదూ.
No comments:
Post a Comment