మనం మాములుగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటాం.వాతావరణంలో తక్కువ తేమతో ఉండే చలి గాలి సరాసరి శ్వాసనాళాలలొకి వెళ్లకుండా ముక్కు ద్వారా వెచ్చగా అయి నీటి ఆవిరిని కూడా కలుపుకుని శ్వాసనాళాల్లోకి వెలుతుంది.ముక్కు నుంచి గాలి నేసోఫారింక్స్,లారింక్స్ ఆతరువాత ట్రేకియాలోకి వెళుతుంది.ట్రేకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగాచీలి ఉంటుంది.వీటిని బ్రాంకై అంటారు.ఇవి విడివిడిగా ఒక్కొక్క ఊపిరితిత్తులలోనికి వెళతాయి.క్రమంగా ఈ నాళం రెండు రెండుగా చీలుతూ ఊపితిత్తులను ఆక్రమిస్తాయి.
No comments:
Post a Comment