తెలంగాణ వెబ్,న్యూస్;56% విద్యార్థుల్లో డిప్రెషన్ 38 శాతం పిల్లలో ఆత్మహత్య యోచన పరిశోధక విద్యార్థిని అధ్యయనంలో వెల్లడి కౌన్సెలింగ్,పర్యవేక్షణే మందు
చదవాలనుకన్నది ఒకటి చదువుతున్నది ఒకటి కొలువుల కోసం తొందర భవిష్యత్తు బెంగ తరగతి గదిలో,హాస్టల్లో,ఇంట్లో...ఎక్కడ ఉన్నా కనిపించకుండానే వెంటాడే ఒత్తిడి మానసిక కుంగుబాటు...చివరికి ఆత్మహత్య ఇదీ...నేటి యువతలో కొందరి పరిస్థితి ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో ఇంటర్ చదువుతున్న వారే ఎక్కువమంది అని నిపుణుల అంచనా జీవితాన్ని మలుపు తిప్పే ఇంటర్ చదువు...జీవితాన్నే బలి తీసుకుంటోంది. ఈ పరిస్థితి పై విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన సైకాలజీ విభాగం పరిశోధక విద్యార్థిని బళ్ల దీప్తి అధ్యయనం చేశారు.ఆమె పరిశోధనకు వర్సిటీ పీహెచ్ డీ బహూకరించింది.
No comments:
Post a Comment