తెలంగాణ వెబ్,న్యూస్;పదోతరగతి విద్యార్థులకు జిల్లా తెలంగాణ గణిత ఫోరం ఈధ్వర్యంలో అవగాహన తరగతులు నిర్వహించునున్నట్లు ఫోరం జిల్లా ఆధ్యక్షుడు దొంతు పాండురంగయ్య తెలిపారు.ఖమ్మం జిల్లాకు చెందిన మానసికనిపుణుడు హరీష్ కుమార్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు.ఈనెల 29న తాడూరు మండలం ఐతోల్ లో,30న పెద్ద కొత్త పల్లిలో,31 న కొల్లాపూర్ లో,వచ్చేనెల 1వ తేదీన షాద్ నగర్ లో ఈ తరగతులు ఉంటాయన్నారు.చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనేలా సహకరించాలని కోరారు.
No comments:
Post a Comment