తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు నచ్చినవారికి నజరానా... నచ్చకపోతే జరిమానా అనేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని తెదేపా శాసనసభా పక్షఉపనేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.గురువారం ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు.నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల్లో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి,హరీశ్ రావులకు ప్రమేయముందని వారిద్దరి పై విచారణ చేయించాలని సీఎంను ఆయన కోరారు. అవినీతికి పాల్పడితే తన కొడుకైనా బిడ్డయినా జైలుకు పంపుతానని, అవినీతి పరుల భరతం పడతానని అంటున్న సీఎం అదే నిజమైతే ఇసుక అక్రమాల పై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment