తెలంగాణ వెబ్,న్యూస్;కొత్త విద్యార్థికి 'ఉపకారం' ఎప్పుడు వస్తుందో తెలియదు,
పాత విద్యార్థికి ఫీజు రీయింబర్స్ అవుతుందో లేదో తెలీదు,
ఫాస్ట్ పథకానికి మోక్షమెప్పుడో తెలియదు,
తెలంగాణ బడుగు విద్యార్థికి ఎంత కష్టం ఎంత కష్టం,
చదువు చెప్పించి ఉపకారం చేస్తందనుకుంటే..తెలంగాణ ప్రభుత్వం పరీక్షల మీద పరీక్షలు పెడుతోంది.కాలేజీల్లో చదువుకునేవారికి ఒక పరీక్ష, చదువులు పూర్తిచేసుకొని కాలేజీ వదిల పెడుతున్నవారికి మరోపరీక్ష,విద్యా సంవత్సరం పూర్తి అవుతుందా లేదా అనేది తెలియదు,విద్యా సంవత్సరం ఎలాగో గట్టెక్కినవారికి సర్టిఫికెట్ దక్కుతుందో లేదో తెలీదు ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా... ఫాస్ట్ పథకానికి మోక్షం కలిగించకుండా..తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షపెడుతున్న తీరు ఇది.గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు.2014-15 విద్యా సంవత్సరంలో కాలేజీల్లో కొత్తగా చేరినవారికి తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క పైసా మంజూరు చేయలేదు.అదేసమయంలో పాత బకాయిలు పూర్తిగా చెల్లించలేదు.
No comments:
Post a Comment