తెలంగాణ వెబ్,న్యూస్;కల్లు కాంపౌండ్ లో ఎస్ ఐ మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.రాయదుర్గం సీఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలం బొట్లగడ్డ తండాకు చెందిన వి.రిములు (53) సైబరాబాద్ పోలీస్ కమిషనరేటర్ లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. రాజేంద్ర నగర్ బుద్వేల్ లోని పోలీస్ క్వార్టర్స్ లో నివసముంటున్న రాములు మంగళవారం ఉదయం కార్యాలయానికి వెళ్లి..10 గంటలకు అనుమతి తీసుకొని బయటకు వచ్చాడు.మధ్యాహ్నం రాయదుర్గం కల్లు కాంపౌండ్ ముందు ఓవ్యక్తి చనిపోయాడని స్థానికులు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు.ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతి చెందిన వ్యక్తి ఎస్ఐ రాములుగా గుర్తించారు.అయితే స్థానికులు మాత్రం రాములు కాంపౌండ్ లోనే చనిపోయాడని అంటున్నారు.కల్లు తాగుతూ నేలకొరిగాడని..అది గమనించిన కాంపౌండ్ సిబ్బంది రాములును బయట వదిలేసినట్లు స్థానికులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment