తెలంగాణవెబ్ న్యూస్;విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ రాబట్టుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.తాను ఆశావాదినని,సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలనే మనస్తత్వం ఉన్న తాను నమ్మకం కోల్పోనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కున్న ఆర్థిక ఇబ్బందులను దావోన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.నిధుల లేమి కారణంగా అభివృద్ది పనులను పరిమితం చేసి నెట్టుకొస్తున్నామని ఆయనకు వివరించామని తెలిపారు. దీని పై స్పందించిన ఆయన చట్టప్రకారం అంధ్రప్రదేశ్ కు రావాల్సిన ప్రయోజనాలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
No comments:
Post a Comment