తెలంగాణ వెబ్,న్యూస్;విద్యార్థుల ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం వారి భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవడం సరికాదని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరత్ కుమార్ అన్నారు.పెండింగులో ఉన్న ఉపకారవేతనాలు,ఫీజు రీఎంబర్స్ మెంటు బకాయిలను తక్షణం విడుదల చేయాలనే డింమాండ్ తో ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం షాద్ నగర్ లో కళాశాలల బంద్ నిర్వహించారు.ఏబీవీపీ నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా పెండింగులో ఉన్నరూ.980 కోట్ల ఉపకార వేతనాల బకాయిలను వెంటనే వడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఫాస్ట్ విధివిదానాలను తెలపాలన్నారు.మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాలు,రెన్యువల్ చేసుకునే తేదీలను ప్రకటించాలని కోరారు.విద్యాసంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు కావొస్తున్నా ఫీజులు చెల్లింపులో తెరాస ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.ఉపకారవేతనాలు విడుదల చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
No comments:
Post a Comment