తెలంగాణ వెబ్ న్యూస్;ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలు..అవగాహనారాహిత్యం అనాలోచిత అసమర్ధ విధానాలు అభద్రత నియంత పాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బలహీనం చేస్తున్నారని టీపీసీీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శుక్రవారం సాయత్రం నల్గొండ జిల్లా భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్,రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణ రెడ్డిలతో కలిసి తమ పార్టీ అధి నేత్రి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కేసీఆర్ మాయమాటలు నమ్మిన ప్రజలు అధికారం ఇచ్చరన్నారు.ఏడు నెలలు కావొస్తున్నా ఏ ఒక్క హామీ అమలుకు కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు.విభజన చట్టంలో నిర్ధేశించిన అంశాల అమలుపై దృష్టి పెట్టకుండా పూటకో మాటతో గాలి కబుర్లతో ప్రజలను మోసం చేస్తున్నారని దయబెట్టారు.
No comments:
Post a Comment