.
Saturday, 24 January 2015
పత్రికా ప్రకటన-1 జనవరి 23, 2015 వైద్య పరమైన సమస్యలు,సవాళ్లు, సంక్షోభాలు ఎదురైనప్పుడే కాకుండా ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా సమర్దంగా ఎదుర్కునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ముఖ్యమంత్రిని కలిసింది. కేంద్ర ప్రజారోగ్య శాఖ అడీషినల్ డైరెక్టర్ జనరల్ డా.అశోక్‌కుమార్, డా.శశిఖరే, డా.ప్రదీప్, డా. మహేష్, డా.ప్రణయ్ కుమార్‌లతో కూడిన బృందం నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులను సందర్శించింది. అనంతరం వారు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా బృందానికి నేతృత్వం వహించిన డా.అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన స్వైన్‌ప్లూ ప్రభావాన్ని తెలంగాణలో బాగా తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయన్నారు. స్వైన్‌ప్లూ పై యుద్దం ప్రకటించి రాష్ట్ర రాజధాని నుండి ఏరియ ఆసుపత్రుల వరకు మందులను అందుబాటులో ఉంచడం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించండంలో కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయని చెప్పా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment