తెలంగాణ వెబ్ న్యూస్;ఆడపిల్లకు భద్రత ఉండే సమాజం కావాలని,ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వెళ్లాలని సినీ నటుడు ,జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే నిలదీయగలిగే సత్తా విద్యార్థుల్లో రావాలని పవన్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఈరోజు ఆయన పర్యటించారు. జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ స్వచ్చభారత్ విజయానికి అందరూ తమ వంతు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.దేశవ్యాప్తంగా పరిశుభ్రత ఒకరి వల్ల సాధ్యం కాదని పవన్ కల్యాణ్ అన్నారు.
No comments:
Post a Comment