తెలంగాణ వెబ్ న్యూస్;పేదలకు ఇళ్ల విషయంలో ఎన్నికల హామీకి కట్టబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిరుపేదలకు నాలుగు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ రోజు ఆయన గృహనిర్మాణ శాఖ పై మంత్రులు,అధికారులతో సమీక్ష జరిపారు.గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు కట్టించే నెపంతో ఓట్ల వేట చేశాయన్నారు.గృహనిర్మాణ పథకం అవినీతికి మారు పేరులా మారిందని కేసీఆర్ ఆరోపించారు. పూర్తి అవినీతి రహితంగా గృహనిర్మాణ పథకం చేపడతామని,మంత్రులు,ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు చెప్పాలని ఆయన అన్నారు. నేతల అభిప్రాయాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్పపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వీటి పై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
No comments:
Post a Comment