తెలంగాణ వెబ్,న్యూస్;అనంతపురం జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పెనుకొండ-మడకశిర మార్గంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు లోయలో పడింది.ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు మృతి చెందారు.40 మందికి గాయాలయ్యాయి.బస్సు మడకశిర నుంచి పెనుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. ప్రమాద సమయంలోబస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం .అధికారులు,పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను హిందూపురం,బెంగళూరు లోని ఆస్పత్రులకు తరలించారు.
No comments:
Post a Comment