All meadia

 

Thursday, 1 January 2015

29 న ఎంబీఏ టీటీఎంకు స్పాట్ అడ్మిషన్లు

తెలంగాణ వెబ్,న్యూస్;యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎంబీఏ టీటీఎం(టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్ మెంట్) కోర్సులో ఖాళీగా ఉన్న  సీట్లకు ఈనెల 29 న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని  ఎంబీఏ టీటీఎం విభాగ కోఆర్డినేటర్ డాక్టర్ పి.పూర్ణచంద్రారావు తెలిపారు. ఈ కోర్సులో పది సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.
   విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, మూడు సెట్ల జిరాక్సు కాపీలు,ఐదు పాస్ పోర్ట్ ఫోటోలతో హాజరు కావాలని సూచించారు.స్పాట్ అడ్మిషన్లు ప్రవేశం పొందిన విద్యార్థులకు ఏవిధమైన  ఉపకార వేతనం,పీజు రీయింబర్స్ మెంట్ రాదని,ఒక్కోసంవత్సరానికి విద్యార్థులు రూ.33 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment