All meadia

 

Tuesday, 25 August 2015

గ్రామజ్యోతి’ అఖండం.. ఆరకుండా కొనసాగించాలి: కేసీఆర్‌

‘ఈ రోజుతో గ్రామజ్యోతి కార్యక్రమం ముగిసిపోలేదు. ఈ జ్యోతిని వెలిగించాం. ఇది ఆరిపోకుండా కొనసాగుతూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగించే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని ప్రజాప్రతినిధులందరిదీ. వైరుధ్యాలు, విబేధాలను వీడి అంతా ముందుకు సాగాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పల్లెలను బంగారు సీమలుగా తయారు చేసుకోవాలన్నారు. అందరూ కలిసి పని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. తాను దత్తత తీసుకున్న కరీంనగర్‌ జిల్లా చిన్న ముల్కనూర్‌లో సోమవారం జరిగిన గ్రామజ్యోతి సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. గ్రామ జ్యోతిలో తమకు భాగస్వామ్యం కల్పించడంలేదంటూ ఎంపీటీసీ, జడ్పీటీసీ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... ‘‘సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు అందరూ పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ప్రతినిధులే. అందరూ సమాన బాధ్యులే. ఈ విషయంలో కొందరు అపార్థంలో ఉన్నారు. వాటిని విడనాడి గ్రామసభల్లో పాల్గొని.. అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి అమలు చేయూలి’’ అని కేసీఆర్‌ కోరారు.

No comments:

Post a Comment