All meadia

 

Friday, 28 August 2015

ఎంత పెద్ద పామో!


  • రుయాలో 14అడుగుల కొండచిలువ
14 అడుగుల పొడవు. 40 కిలోల బరువు. పదేళ్ల వయసు. ఇంత పెద్ద కొండ చిలువ గురువారం తిరుపతిలోని రుయాస్పత్రిలో కలకలం రేపింది. రుయా ఆవరణలోని డీఎల్‌వో కార్యాలయం సమీపంలో పాడుపడిన సెప్టిక్‌ ట్యాంకు ఉంది. అందులోకి ఎప్పుడొచ్చిందో ఏమో కానీ.. ఈ పెద్ద కొండచిలువను ఉదయం 11.30 గంటల ప్రాంతంలో రోగుల సహాయకులు గుర్తించారు. భయంతో కేకలు వేశారు. ఈ విషయాన్ని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంధ్య, సీఎస్‌ ఆర్‌ఎం చంద్రయ్యలు టీటీడీ అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కొండ చిలువ ఉన్న సెప్టిక్‌ ట్యాంకులో నీళ్లు ఎక్కువగా ఉండటంతో ట్యాంక్‌ క్లీనర్‌ యంత్రాన్ని తీసుకొచ్చి నీటిని తోడేశారు. ఆ తర్వాత టీటీడీ ఫారెస్ట్‌ మేసి్త్ర భాస్కర్‌నాయుడు, ఆదిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు భాస్కర్‌నాయుడు చాకచక్యంగా కొండ చిలువను బయటకు తీసుకొచ్చి గోతాములో ఎస్వీ జూపార్కుకు తరలించారు. గతం లో ఇదే ప్రాంతానికి చిరుత వచ్చింది. కాగా, అటవీ ప్రాంతానికి దగ్గరగా రుయాస్పత్రి ఉండటంతో వన్య ప్రాణులు వస్తున్నాయని సీఎస్‌ఆర్‌ఎంవో చంద్రయ్య చెప్పారు.

No comments:

Post a Comment