All meadia

 

Thursday, 20 August 2015

ఓపెన్‌ స్కూల్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ చేసేందుకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చినట్లు రాంనగర్‌లోని సాధన కళాశాల ఓపెన్‌ స్కూల్‌ కరస్పాంటెండెంట్‌ డాక్టర్‌ మహ్మద్‌ ఆలీ తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌ చేయాలనే ఆసక్తి గల విద్యార్థ్ధులు వచ్చే నెల 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవడానికి గడువును ప్రభుత్వం పొడిగించిందని ఆయన వివరించారు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా వచ్చే సంవత్సరంలో కేవలం 5 పేపర్లు పాసైతే ఇంటర్మీడియట్‌ కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్‌ వస్తుందని తెలిపారు. ఈ కోర్సు చేయడానికి పదో తరగతి పాసై ఒక సంవత్సరం గ్యాప్‌ ఉన్న వారు లేదా ఏదైనా కారణం చేత చదువు ఆపేసిన వారు ఓపెన్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్‌ పొందవచ్చని తెలిపారు. బైపీసీ పాసైన విద్యార్ధులు ఎంసెట్‌ రాసి డాక్టర్‌ కోర్సులో లేదా కొత్తగా డీ-ఫార్మసీ కూడా చేసుకోవడానికి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతకు అనుమతి ఉందని తెలిపారు. ఆసక్తి గల వారు వివరాలకు సెల్‌ నెంబర్‌ 9247476873 లో సంప్రదించాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment