All meadia

 

Saturday, 22 August 2015

ఎర్రబెల్లి, మందకృష్ణపై మండిపడ్డ డిప్యూటీ సీఎం కడియం

టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఎర్రబెల్లి దయాకర్‌రావు తన భాష తీరును మార్చుకోవాలన్నారు. తనకు మంత్రి పదవిని ఇప్పించానని అంటున్న ఎర్రబెల్లి మాటలను చూసి నవ్వుకోవాల్సి వస్తోందన్నారు. ఇక మంద కృష్ణ మాదిగ రోజుకో మాట, పూటకో పార్టీతో ఉంటారన్నారు. మంద కృష్ణ వ్యవహరశైలితో మాదిగలంతా ఎమ్మార్పీఎస్‌కు దూరమవుతున్న విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు.

No comments:

Post a Comment