All meadia

 

Friday, 28 August 2015

ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీ చేయాలి: బీజేపీ

రాష్ట్రంలోని ఉస్మానియా, జేఎన్‌టీయూ, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో రెండోవిడత కౌన్సెలింగ్‌ తర్వాత ఇంకా 285 ఇంజనీరింగ్‌ సీట్లు ఖాళీగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. నిబంధనల కారణంగా ప్రభుత్వ కాలేజీలు వీటిని భర్తీ చేయడం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల నెపంతో సీట్లు భర్తీ చేయకపోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభమైన దృష్ట్యా ఈ సీట్ల భర్తీతో పాటు స్లైడింగ్‌, కాలేజీల మార్పునకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరారు.

No comments:

Post a Comment