All meadia

 

Thursday, 27 August 2015

జగన్ ధర్నాలు చూసి జనం నవ్వుకుంటున్నారు : కేఈ

జగన్ ధర్నాలు చూసి జనం నవ్వుకుంటున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ధర్నాలకు రైతులు ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అవసరమని అన్నారు. రాజధాని కోసం భూసేకరణ అవసరం లేదని, రైతులే స్వచ్చందంగా భూములు ఇస్తారని మంత్రి పేర్కొన్నారు. భూసేకరణ నోటిఫికేషన్లు పాలనలో ఓ భాగమన్నారు. రాయలసీమ అభివృద్ధికి లక్షకోట్ల ప్యాకేజీ కావాలని కేఈ కోరారు.

No comments:

Post a Comment