All meadia

 

Friday, 28 August 2015

గుండె పోటుతో ఎమ్మెల్యే సోదరుడి మృతి

విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే,వైఎస్ ఆర్ సీపీ నాయకుడు జలీల్ ఖాన్ సోదరుడు మున్వర్ ఖాన్ (56) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.ఎమ్మెల్యే ఆయన సోదరుడు వన్ టౌన్ లోని  తారాపేటలోని నివాసం ఉంటున్నారు.
అయితే శుక్రవారం ఉదయం మున్వర్ ఖాన్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా  ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.మున్వర్ ఖాన్ మృతి పట్ల  పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.

No comments:

Post a Comment