All meadia

 

Thursday, 20 August 2015

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నా : ఎర్రబెల్లి

అనుచరులపై లాఠీచార్జ్‌కు నిరసనగా ధర్నాకు దిగిన రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తిలో రేపు మంత్రి పర్యటన ఉంది...స్థానిక ఎమ్మెల్యేనైనా తనకు ఇంత వరకు సమాచారం లేదు మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గుండాగిరీ చేస్తున్నారని విమర్శించారు. జూపల్లి కర్నాటక సరిహద్దు వద్ద డ్రామాలు ఆపి, ఢిల్లీ వెళ్లి అక్రమ ప్రాజెక్టులను ఆపించాలని ఎర్రబెల్లి హితవు పలికారు.

No comments:

Post a Comment