All meadia

 

Wednesday, 19 August 2015

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మారిస్తే జాతీయ హోదా ఎలా వస్తుంది? : ఎర్రబెల్లి

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మారిస్తే జాతీయ హోదా ఎలా వస్తుందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ... ఒకవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే సీఎం కేసీఆర్ ఏ ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారంటూ ఆయన విమర్శించారు. పూర్తిగా కరువు కాటకాల్లో ఉండే వరంగల్ జిల్లా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌కు దేవాదుల ప్రాజెక్టు వల్లే నీరు వస్తున్నాయని, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావుకు మతి భ్రమించిందని, టీఆర్ఎప్ నేతలకు వారి వారి భార్యలు అన్నం పెట్టకపోయినా... దానికి టీడీపీనే కారణం అనేట్లుగా ఉన్నారని ఆయన ఛలోక్తులు విసిరారు.

No comments:

Post a Comment