All meadia

 

Thursday, 20 August 2015

చంద్రబాబు చేతుల్లో భద్రంగా విద్యార్థుల భవిష్యత్‌ :గంటా.....విద్యాకేంద్రంగా తాడేపల్లిగూడెం : మంత్రి మాణిక్యాలరావు

ఏపీ విద్యార్థుల భవిష్యత్‌ చంద్రబాబు చేతుల్లో భద్రంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ర్యాగింగ్‌ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం మంత్రి గంటా స్పష్టం చేశారు.
 
పగో జిల్లాపై చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందని మరో మంత్రి మాణిక్యాలరావు అన్నారు. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే తాడేపల్లి గూడెంను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు కోరారు. నిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్య, స్మృతి ఇరానీ, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

No comments:

Post a Comment