All meadia

 

Saturday, 29 November 2014

వెనకబడిన వారికి ప్రోత్సాహం అందించడానికి ముందుకు వచ్చాం..... రాజేశ్వర్ రావు

తెలంగాణలో 70 శాతం యువత నిరుద్యోగులుగానే ఉన్నారు.... మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మచేందర్ రావు....
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్ : స్వర్ణకంటి ఇండస్ట్రీయల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించడానికి ఎస్ ఎస్ ఎం ఈ సంస్థ కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ ఎం.ప్రభాకర్ రావు అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు సమస్యలను ఎద్కొని పోరాడాలన్నారు. ఒక ఇనిస్టిట్యూట్ పెట్టాలంటే స్థలం దానికి సంబంధించిన సదుపాయాలు కావాలన్నారు.వాటిని సమకూర్చుకునేందుకు తమ సహాయ సహాకారాలు ఉంటాయని తెలిపారు. నిరుద్యోగులుగా ఉంటున్నవారు తమ సంస్థకు వస్తే ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులుగా ఎందుకు మిగిలిపోతున్నారు..... వారికి మంచి స్కిల్క్స్ ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ డెవలప్ కోసం తము ఎప్పుడు సిద్దంగా ఉంటామని తెలిపారు. విలేజ్ లెవల్ నుంచి డిస్ట్రిక్ లెవల్ వరకు  మొత్తం 70 శాతం వరకు యువత చదువు ఉన్నా నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మచేందర్ రావు, ఎంవి రాజరామ్,  టి చంద్ర శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment