All meadia

 

Wednesday, 19 November 2014

సనత్ నగర్ నియోజకవర్గానికి టీడీపీకి పునర్జీవం..... కూన వెంకటేష్ గౌడ్

  • టీడీపీకి మొగ్గు చూపుతున్న తెలుగు తమ్ముళ్ళు
  • సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన...
  • త్వరలో అన్ని డివిజన్లలో పాదయాత్ర....
  • రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తేదేపాదే విజయం....
కూన వెంకటేష్ గౌడ్ 


తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: టీడీపీకి పూర్వ వైభవం తెస్తానని సనత్ నగర్ ఇన్ ఛార్జీ కూన వెంకటేశ్ గౌడ్ అన్నారు. బుధవారం తన నివాసంలో  తెలంగాణ వెబ్ న్యూస్ తో మాట్లాడుతూ  మాట్లాడుతూ వివిధ కారణాల వలన పార్టీ అస్థవ్యస్థలకు గురైన, తిరిగి మళ్లీ పునర్జీవం పోస్థున్నట్లు తెలిపారు. కొందరు పార్టీ నుండి బయటకు వెళ్లిన పార్టీకి నష్టమేమి ఉండదని తెలిపారు. పాత నీరు పోయి కొత్త నీరు చేరినట్లు పోవడం రావడం యాదృశ్చికమేనన్నారు. ఈ విషయం అంత పెద్ద సమస్య ఏమి కాదన్నారు. అనతి కాలంలో టీడీపీకి నియోజకవర్గంలో పూర్వ పరిస్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డివిజన్లకు చెందిన తెలుగు తమ్ముళ్ళు తిరిగి పార్టీలోకి రానున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో సభ్యత్వ నమోదు  2014-16 సంవత్సరానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భాగంగా సనత్ నగర్  నియోజకవర్గంలోని మహిళలు, యువత పెద్ద ఎత్తున పార్టీలోకి
 చేరినట్లు ఆయన  తెలిపారు. త్వరలో డివిజన్ ప్రెసిడెంట్లను నాయకులను, కార్యకర్తలను కలుపుకొని అన్ని డివిజన్లను పర్యటిస్తానని తెలిపారు. రాబోయే కార్పొరేషన్  ఎన్నికల్లో టడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన  ధీమా వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment