All meadia

 

Thursday, 20 November 2014

సనత్ నగర్ నెహ్రూ పార్కులో ఉచిత వైద్య శిభిరం...

  • ముఖ్య అతిథిగా జాతీయ బీసీ మహిళా సమాఖ్యా అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి హాజరు....
  • ప్రతి 100 మంది మహిళలకు 90 మంది మహిళలు రక్తహీనతతో ఇబ్బందులు....
  • ఈ వైద్య క్యాంపులో 1000 మందికిపైగా ఉచిత వైద్య పరీక్షలు.... 
  • ఆశోజు శ్రీనివాస్ పుష్పలత ఆధ్వర్యంలో.....వైద్య పరీక్షలు...

 
వైద్య శిభిరంలో పాల్గొన్న డాక్టర్లు, మహిళలు..... 

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: సనత్ నగర్ నెహ్రూ పార్కులో బిసి సంక్షేమ సంఘం హెల్త్ క్యాంప్ ను అసోజు శ్రీనివాస్, పుష్పలత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా జాతీయ బీసీ మహిళా సమాఖ్యా అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి హాజరై  సమావేశాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ హెల్త్ పరంగా అందరూ జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా మహిళలు గర్బవతిలో ఉన్నవారిని ఆరోగ్య శ్రీ కార్డులో కలపాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈ హెల్త్ క్యాంపులో 1000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ పరీక్షలు నిర్వహించారు. ప్రతి 100 మంది మహిళల్లో 90 మంది మహిళలకు రక్త హీనత ఉందని డాక్టర్లు  తెలిపారు. గర్భసంచి సమస్యలతో  భాదపడుతున్న మహిళలకు గర్భసంచి తొలగించే విధానాన్ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కు  విజ్ఞప్తి  చేశారు. 

 ఆరోగ్యం పరంగా ప్రతి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా అత్యవసర సమయాల్లో చూసేందుకు హెల్త్ కార్డులను మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ మీనా కూమారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  సనత్ నగర్ బిసి సంఘం సమాఖ్యా ఇన్ చార్జీ ఫర్జానా ఇబ్రహిం,  విజయలక్ష్మి,  లలిత, రాజేశ్వరి, పావని, అరుణశ్రీ, లావాణ్య, విజయలక్ష్మి,  కవిత, మాలతి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment