గౌడ సంఘం భవనానికి శంఖు స్థాపన చేసి తన వంతు ఐదు లక్షలు...
ఏది ఏమైనా ప్రజల కోసంమేనన్న ఎమ్మెల్యే.... తలసాని
సనత్ నగర్ గౌడ సంఘం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తలసాని
సనత్ నగర్ గౌడ సంఘం కార్యక్రమంలో పాల్గొన్ని సభ్యులు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;నూతన కార్యవర్గం గౌడ కులానికి పేరు ప్రతిష్టలు తేవాలని, గౌడ సంఘం అభివృద్దికి తోడ్పడాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ లోని నెహ్రూ పార్కులో గౌడ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన సన్మాన సభకు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం గౌడ సంఘం అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ఎమ్మెల్యేకు ఘనంగా పూల మాలలు వేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం నిత్యం పాటు పడుతున్నట్లు, అందుకోసమే రాజకీయ మార్పులు అనేవి ప్రజలకు తెలుసు అని అన్నారు. సనత్ నగర్ లో గత పదేళ్ళుగా ఏ ఒక్క అధికారి పని చేయకపోవడం వల్ల నియోజకవర్గంలోని ఎక్కడవేసిన గొంగలి అక్కడే ఉందని అన్నారు. నియోజకవర్గ అభివృద్దికి కేసీఆర్ ఎంతగానో సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన గౌడ సంఘం భవనానికి శంఖు స్థాపన చేసి, ఐదు లక్షలను విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట డివిజన్ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, సనత్ నగర్ గౌడ సంఘం అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ఉపాధ్యక్షులు కె.శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, కె.మురళి గౌడ్, బల్కంపేట డివిజన్ అధ్యక్షుడు బుట్టి రాజశేఖర్, కరుణాకర్ రెడ్డి, కుమార్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment