ఆకలి గొన్న ఒక కాకి ఒక చోట హాయిగా విశ్రాంతిగా కునుకు తీస్తున్న ఒక పాముని చూసింది.బాగా నిద్రలో వుంది.దీన్ని ఎత్తుకు పోయి నెమ్మదిగా పొడొచి పొడిచి తింటాను అనుకుంటూ రివ్వున వచ్చి పాము మీద తన పదునైన గోళ్ళుగుచ్చుకునేలాగ వాలింది.పాము క్షణంలొ మేలుకుని కాకి మీద ఎదురు తిరిగింది.ఒక్క కాటు వేసింది.కాకి ఆకాటుకి మరణిస్తూ అయ్యో నాదికదా దారుణమైన మృత్యువంటే.ఎదో చాలా అదృష్టం కలిసి వచ్చి తినడానికి పాము దొరికిందనుకున్నానే చావు కోరి తెచ్చుకున్నానని తెలుసు కోలేక పోయాను అని కాకి వాపోయింది.
No comments:
Post a Comment