హైదరాబాద్@ ప్లాష్ మాబ్....ఫిట్ నెస్ గురూ.....
- మహిళల పట్ల అఘాయిత్యాలు, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ ప్లాష్ మాబ్.....
- ప్లాష్ మాబ్ అనేది గ్రూప్ డ్యాన్స్ లాంటిది..... చూసేవారికి మాత్రం కనువిందు చేస్తుంది.....
- 2003లో మొదట మాన్ హట్టాన్ లో ప్రారంభం....
- మహిళల ఫిట్ నెస్ కోసం కొత్త పద్దతులు....గ్రూప్ డ్యాన్స్ లదే ప్రాముఖ్యత
- ఫిట్ నెస్ పద్దతులు పాటించడం వల్ల చక్కటి శరీర ఆకృతి పొందొచ్చు.... సెంట్రో షాపింగ్ మాల్ సీఈవో శ్రీధర్
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: ప్లాష్ మాబ్ అనేది ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైందని సెంట్రో షాపింగ్ మాల్ సీఈవో శ్రీధర్ గణేష్ అన్నారు. కూకట్ పల్లి జేఎన్ టీయూ హైదరాబాద్ ఫోరం మాల్ లో ఫ్లాష్ మాబ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీధర్ మాట్లాడుతూ విమెన్స్ సెప్టీ అవేర్నెస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహించామన్నారు. మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ ఈ ప్లాష్ మాబ్ నిర్వహించామన్నారు. కొందరు ఫ్లాష్ మాబ్ ను చారిటీ కోసం నిర్వహిస్తుంటే, మరి కొందరు సరదా కోసం, ఇంకొందరు మార్కెటింగ్ కోసం నిర్వహిస్తున్నారన్నారు. ఫ్లాష్ మాబ్ ట్రైనర్ మాట్లాడుతూ మహిళలు తమ ఫిట్ నెస్ గురించి శ్రద్ద వహించాలన్నారు. డ్యాన్స్ కూడా చక్కటి ఫిట్ నెస్ ఇస్తుందని తెలిపారు. మహిళల భద్రత అంతంత మాత్రాన ఉన్న ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చురుకుదనం కలిగి ఉండాలన్నారు. ఫిట్ నెస్ పద్దతులు పాటించడం వల్ల చక్కటి బుద్ది, ఆకర్షనీయ శరీర ఆకృతి వస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడా తీసిపోని విధంగా ప్లాష్ హాబ్ లు జరుగుతున్నాయన్నారు.
ఫ్లాష్ మాబ్ ఎప్పుడు ప్రారంభమైంది.... ఏమిటి విశేషతలు....
2003వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా మొదలైన ఈ ప్లాష్ మాబ్ ఇప్పుడు ప్రపంచపు అన్ని నగరాల్లో దర్శనమిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఫ్లాష్ మాబ్ లు సరికొత్తగా ఆవిష్కరణలు జరుపుతున్నారు. డ్యాన్స్ లతో పాటు పాటలు, మ్యూజిక్ సరికొత్త రకంగా ఇదంతా ఫిట్ నెస్ కోసమే చేస్తున్నట్లు పలువురు తెలుపుతున్నారు.
ప్లాష్ మాబ్ లతో ఆనందం చురుకుదనం కొత్త విషయాలను ప్రజల్లోకి అత్యంత త్వరగా చేర్చొచ్చని తెలిపారు.
No comments:
Post a Comment