తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: స్టార్టప్ కంపెనీలకు బిజినెస్ రంగంలో వారికి ఎంత లాభం వస్తుంది... ఎంత నష్టం వస్తుందో ప్రతి పైసాను లెక్కించినప్పుడే స్టార్టప్ కంపెనీలు బలపడతాయని ఎన్ ఎస్ ఎం ఈ డెవలప్ మెంట్ డైరెక్టర్ అరవింద్ పట్వారి అన్నారు. శనివారం లకిడికపూల్ ల్లోని ఫ్యాపీ లో సపోర్ట్ బ్యాంకర్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత స్టార్టప్ లను ప్రారంభించేటప్పుడు వారి కొత్త ఆలోచన విధానాలు, తాము ఏంటిపై బిజినెస్ చేస్తున్నారో వివరించి చెప్పితే వారు కొన్ని అవకాశాలు వినియోగించుకోవాలని అన్నారు. లోన్ తీసుకునే ముందు చాలా ఆ లోన్ మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందని ఆలోచించాలన్నారు. డబ్బులు మనకు ఎందుకు కావాలి... ఏమిటికి ఖర్చు చేయాలి.... అది ఆలోచించిన తరువాతే తీసుకుంటే ఫలితం ఉంటుందన్నారు. అనవసర ఖర్చులకు వాడకోకూడదన్నారు. మార్కెట్ ఒకసారి నష్టం వస్తే మరో సారి లాభం వస్తుందన్నారు... నష్టం వస్తుంది కదా అని మూసివేయకూడదన్నారు. చైనీస్ వారు మన దేశంలో రాఖీల నుంచి పతంగుల వరకు కూడా వారి బ్రాండ్ పేరుమీదనే మనం వాడుకుంటున్నామన్నారు. ఇప్పట్లో స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా ఆన్ లైన్ లోనే బిజినెస్ చేసుకుంటున్నారన్నారు. ఒక ఐడియా ఉంటే రిటైర్డ్ అయి ఇంట్లో కూర్చిని డబ్బులు సంపాదించుకోవచ్చునన్నారు. ఈ సమావేశంలో ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి.వి, సురానా గ్రూడ్ డైరెక్టర్ దేవేంద్ర సురానా, హెచ్ డిఎఫ్ సి బ్యాంకు లిమిటెడ్ ఉపాధ్యక్షులు విశాల్ బాటియా, ఆంధ్రబ్యాంకు సీనియర్ మేనేజర్ భాస్కర్, ఎన్ టిఎస్సి, ఎన్ ఎస్ ఐ సి మధన్ మోహన్ ఆయా విభాగాలకు చెందిన నాగరాజ బాబా, ఎస్ ఎల్ నర్సింహా. పవన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment