హైదారాబాద్; శంషాబాద్ విమనాశ్రయం దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో తెలంగాణ శసనసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము ఖండిస్తున్నట్లుచెప్పారు.రాష్ర్ట విభజన తర్వాత కూడా సీమాంధ్ర నేతల ఆధిపత్యం కొనసాగుతునే ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జీవన్ డిమాండ్ చేశారు.దీని పైముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ..ఇది చాలా సున్నితమైన అంశమని ప్రశాంతంగా ఉన్న సమాజంలో ఒక రాయివిసిరిన మాదిరిగా ఈ ఘటన ఉందని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment