All meadia

 

Saturday, 22 November 2014

ప్రతి చిన్నారికి చక్కటి జీవితాలను అందించడమే మా కల....

  • వికలాంగులతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు ప్రోత్సాహం....  
  • చిన్న పిల్లలకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడమే మా కర్తవ్యం.... 
  • అప్రయ్ ఆకృతి సంస్థకు చెందిన పలు మానసిక వికలాంగుల పిల్లలు....
  • ఈ కార్యక్రమాలను గడిచిన ఐదు సంవత్సరాలుగా వరుసుగా నిర్వహిస్తున్నాం...
  • కర్టూన్లతో పిల్లలతో ఆటలతో ఉల్లసాన్ని అందించే ప్రయత్నం..... 

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;  వికలాంగులు.... మానసిక.... అనాథ పిల్లల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సారి కూడా వారి ఆనందం కోసం రకరకాలుగా ఆటా.... కర్టూన్ల ప్రదర్శనలో వికలాంగులు, అనాథ పిల్లలతో ఆటలు ఆడించారు.  అమీర్ పేట ఆధిత్య పార్కు హోటల్లో శనివారం  ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డ్యాన్స్ ఫ్లోర్ లో పలు రకాల ట్యూన్లతో పిల్లలు డ్యాన్సులు చేయించారు. గెలిచిన వారికి బహుమతులు బహుకరించారు. ఈ సందర్బంగా ఆదిత్య పార్కు  జనరల్ మేనేజర్ సుబ్రమణ్యన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా తాము ఉన్న సమాజంలో ఎంతో కొంత సేవ చేసినవారమవుతామని తెలిపారు. ఆడుతూ పాడుతున్న చిన్నారుల్లో కనిపిస్తున్న చిరునవ్వులే మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆదిత్య హోమ్ టెల్ హోటల్ మేనేజర్ రిచర్డ్ రాజేశ్, అష్రయ్ ఆకృతి  కి చెందిన  సుమతి లాల్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఆనందాన్ని, సంతోషాన్ని, ఆప్యాయతలను తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య పార్కు, ఆదిత్య హోమ్ టెల్ హోటల్స్ చెందిన పలువురు సిబ్బంది, చిన్న పిల్లలు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment