హైదారాబాద్ ; ఇంటర్మీడియెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేందుకు కలిసిరావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు విజప్తి చేసింది.తెలంగాణ సరీక్షల షెడ్యూల్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పరీక్ష తేదీలను ముందుకు జరిపేందుకు కూడా సిద్దమని ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వాశాఖలో ప్రకటించారు ప్రవేశాలను పదేళ్లపాటు ఉమ్మడిగా నిర్వహించాలని విభజన చట్టంలో పేర్కొన్నారని ..తెలంగాణ ప్రభుత్వం చట్టాలను ఏమాత్రం గౌరవించడం లేదన్నారు.ఎం సెట్ ను ఉమ్మడిగా నిర్వహిస్తూ ...ఇంటర్మీడియెట్ పరీక్షలను వేర్వేరుగా జరుపాల్సిన అవసరం ఏ మొచ్చిందని ప్రశ్నించారు.తెలంగాణ ప్రభుత్వం పంతం వల్ల రెండు ప్రాంతాల్లో విద్యార్తులకు నష్టం జరుగుతుందని..తెలంగాణ ప్రభుత్వం పట్టు విడిచి ఉమ్మడిగా పరీక్ష నిర్వహించేందుకు సహకరించాలని విజప్తి చేశారు.
No comments:
Post a Comment